తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Diwali.. దీపావళి శుభాకాంక్షలు.. పండుగ విశిష్టతలు తెలుసా మీకు?

చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను చేసుకుంటారు. హిందూ సంప్రదాయంలో అతి పెద్ద పండుగ దీపావళి. మీ ఇంట్లో కూడా ఆనందోత్సవాలు వెల్లివిరియాలని, కొత్త కాంతులు రావాలని పక్కాతెలుగు.కామ్ ఆకాంక్షిస్తోంది. ప్రజలందరికీ పక్కాతెలుగు.కామ్ దీపావళి శుభాకాంక్షలు చెబుతోంది.

దీపావళి నేపథ్యం
పూర్వం నరకాసురుడనే రాక్షసుడు ప్రజలను తీవ్రంగా హింసించేవాడు. నరకాసురుడితో ప్రజలందరూ చాలా కష్టాలు పడ్డారు. అతడిని అంతమొందించడంతో ఆ తర్వాతి రోజు ప్రజలందరూ ఆనందోత్సహాలతో పండుగ చేసుకుంటారు. దీపాలు వెలిగించి, పూజలు చేసి, టపాసులు కాల్చి ప్రజలు ఉత్సవాలు చేసుకున్న రోజును దీపావళిగా పరిగణించారు.

Also Read విజయవాడలో హీరో కమల్ హాసన్ పై రాళ్ల దాడి.. ఎందుకంటే..?

మరో కథనం కూడా ఉంది. రామాయణం నేపథ్యంగా దీపావళి కథ ఒకటి ఉంది. సీతమ్మను ఎత్తుకెళ్లిన రావణాసురుడిపై రాముడు యుద్ధం ప్రకటించాడు. వానర సేనలతో కలిసి లంకను ముట్టడించాడు. భీకర యుద్ధంలో రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చాడు. తమ ఆరాధ్య దేవుడు, పాలకుడు సీత సమేతంగా రావడంతో ప్రజలు ఆనందోత్సవాల మధ్య చేసుకున్న ఉత్సవాన్ని దీపావళి అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button