తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

AP News విజయవాడలో హీరో కమల్ హాసన్ పై రాళ్ల దాడి.. ఎందుకంటే..?

అవును! నిజంగానే ఏపీలోని విజయవాడలో స్టార్ హీరో కమల్ హాసన్ పై రాళ్ల దాడి జరిగింది. అంతటి హీరోపై రాళ్ల దాడి జరగడమా అని కంగారు పడుతున్నారా? ఆగండాగండి. కమల్ హాసన్ (Kamal Haasan)పై దాడి జరిగింది నిజమే కానీ అది కేవలం షూటింగ్ కోసమే. ఓ సినిమా షూటింగ్ (Shooting)లో భాగంగా ఆయనపై రాళ్లు, కర్రలతో చితకబాదే సన్నివేశాలను చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

భారతీయ సినిమా చరిత్రలో కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ సినిమాకు ప్రత్యేకత ఉంది. ఆ సినిమా యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ ‘భారతీయుడు-2’ (Bharateeyudu Movie) చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా విజయవాడలో (Vijayawada) 4 రోజులుగా పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హీరో కమల్ హాసన్ కు సంబంధించిన సన్నివేశాలు షూట్ చేశారు. శుక్రవారం ‘భారతీయుడు’ పాత్రలో ఉన్న కమల్ హాసన్ పై దాడి చేసే సన్నివేశం తీశారు.

Also Read హీరోయిన్ రష్మికకు మరో షాక్.. మళ్లీ రెచ్చిపోయిన ఆకతాయిలు

సన్నివేశంలో భాగంగా ఒక చౌరస్తాలో హీరో కమల్ పై ప్రజలు రాళ్లు, కర్రలతో దాడి చేస్తుంటారు. వారి దాడిలో గాయాలపాలై బాధపడుతున్న సన్నివేశంలో కమల్ నటించారు. ఈ సన్నివేశం (Scene) సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా ఎస్. శంకర్ (S Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, షూటింగ్ కు ముందు విజయవాడలో ఏర్పాటుచేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని కమల్ ఆవిష్కరించారు.

షూటింగ్ కు సంబంధించిన వీడియోను కింద చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button