తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Hyderabad: బిగ్ అలర్ట్.. నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం నగరంలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు అనుమతి లేని వాహనాలను పూర్తిగా నిషేధంతోపాటు అనుమతి తీసుకున్న వాహనాలను నిర్ణీత సమయాల్లోనే అనుమతి ఇచ్చేలా కొత్వాల్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త రూల్స్ నేటినుంచి అమలులోకి రానున్నాయని, అతిక్రమిస్తే చట్టపర చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ALSO READ: నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ… పలు కీలక అంశాలపై చర్చ

91 రకాల రూట్లు..

హైదరాబాద్‌లోని రహదారులను మొత్తం 91 రకాల రూట్లుగా విభజించారు. ఇందులో భారీ వాహనాలతోపాటు ఇతర వాహనాలకు సైతం ఓ నిర్ణీత సమయాలు కేటాయించారు. కొన్ని మార్గాల్లో వెళ్లాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

  • 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో వచ్చే కమర్షియల్‌ వాహనాల ప్రవేశం నిషేధం.
  • నగరంలోని వాహనాల్లో 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో ఉంటే కేవలం రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య అనుమతి.
  • 3.5 -12 టన్నుల మధ్య బరువుతో ఉన్న గూడ్స్ వాహనాలకు మధ్యా హ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు.
  • 2 నుంచి 6 టన్నుల మధ్య బరువు ఉన్న వ్యర్థాలను తరలించే వాహనాలు ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5, రాత్రి 10 నుంచి ఉదయం 9 వరకు, 10 టన్నులు అంతకంటే ఎక్కువ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటలకు మాత్రమే అనుమతి.
  • ప్రైవేట్‌ బస్సులు కేవలం రాత్రి 10 నుంచి ఉ. 8 గంటల మధ్య మాత్రమే ప్రయాణం. – తోపుడు బండ్లు, సైకిల్‌ రిక్షాలు, ట్రాక్టర్లు తదితర వాటికి 61 టూర్లలో నిషేధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button