తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Vijay: స్టార్ హీరోతో ఛాన్స్.. ‘నో’ చెప్పిన కుర్ర హీరోయన్.. ఎందుకో తెలుసా?

స్టార్ హీరోతో నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఈ కుర్ర హీరోయిన్ మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ స్టార్ హీరోతో కలిసి నటించలేనని ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. ఆమె నిర్ణయాన్ని కొందరు అభిమానులు సమర్థిస్తుండగా, మరికొందరు అభిమానులేమో మంచి ఛాన్స్ వస్తే మిస్ చేసుకుందని నిరుత్సాహపడుతున్నారు. ఇంతకీ ఆ కుర్ర హీరోయిన్ ఎవరో కాదు, ‘లవ్ స్టోరీ’ సినిమాలో తన నటనతో అన్ని భాషల్లోని ప్రేక్షకులను కట్టిపడేసిన ‘ఇవానా’. ఇంతకీ ఆమెకు అవకాశం వచ్చింది ఎవరితో కలిసి నటించేందుకో తెలుసా తమిళ స్టార్ హీరో విజయ్‌తో!

ALSO READ: ఉత్తమ నటుడిగా షారుఖ్, ఉత్తమ నటిగా నయనతార

ఎందుకు వద్దనుకుందంటే?

తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ ప్రస్తుతం ‘ద గోట్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయంతో, డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు మూవీపై అంచనాలను పెంచాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్ చెల్లెలి పాత్రకు ఇవానాను ముందు సంప్రదించారట. అయితే, చెల్లి పాత్ర చేస్తే తనకు హీరోయిన్‌గా ఛాన్సులు తగ్గే ప్రమాదముందని, అందుకే నో చెప్పినట్లు తాజాగా ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఫలితంగా ఈమెకు బదులు నటి-మోడల్ అభియుక్తని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారట. కాగా.. ఈ మూవీలో ప్రభుదేవా, అజ్మల్, ప్రశాంత్ తదితరులు కీలక పాత్ర పోషిస్తోంది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button