తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Dada Saheb phalke Awards: ఉత్తమ నటుడిగా షారుఖ్, ఉత్తమ నటిగా నయనతార

సినిమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఏటా ఇచ్చే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డ్స్- 2024’ కార్యక్రమం నిన్న రాత్రి ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గతేడాది విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘జవాన్’ సినిమాలో తన నటనకు గానూ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. ఈ సినిమాలో డ్యుయల్ రోల్‌లో షారుఖ్ అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే. అదే సినిమాలో నటించిన లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఉత్తమ నటి అవార్డు వరించింది.

ALSO READ: హనుమాన్ మూవీ అప్డేట్.. ’రఘునందన‘ వీడియో సాంగ్ రిలీజ్

మరోవైపు రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్థాయిలో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ‘యానిమల్’ మూవీకి గానూ సందీప్ వంగాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించింది. ఉత్తమ విలన్ (యానిమల్)గా బాబీ డియోల్, ఉత్తమ నటుడు (క్రిటిక్స్)గా విక్కీ కౌశల్ (సామ్ బహదూర్), ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ అవార్డులు అందుకున్నారు. ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ అవార్డు యేసుదాసుకి, ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అవార్డు మౌషుమీ ఛటర్జీలను వరించాయి. ఈ కార్యక్రమంలో ఇంకా పలువరు సాంకేతిక నిపుణులు, టెలివిజన్ నటీనటులకు కూడా అవార్డులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button