తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Israel-Hamas War: గాజాలో ఇజ్రాయిల్ నరమేధం.. అమెరికా కీలక ప్రకటన

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన సైనికులు, సాధారణ పౌరులు వేల సంఖ్యలో మరణిస్తున్నారు. మరోవైపు పాలస్తీనాలోని గాజా పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రెండు రోజుల క్రితం అక్కడ తిండి పొట్లాల కోసం ఎగబడ్డ వారిపై ఇజ్రాయెల్‌ సైన్యం అత్యంత విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రజలు మృతిచెందారు. 700 మంది దాకా గాయపడ్డారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. గాజాలో విమానాల ద్వారా ఆహార పొట్లాలు జార విడుస్తామని అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటన చేశారు.

ALSO READ:  బిహార్‌లో మళ్లీ వేడెక్కిన రాజకీయం!

గాజాలో ఆహార పొట్లాల పంపిణీ ఇకపై నిరంతరం కొనసాగుతుందని బైడెన్ తెలిపారు. మరోవైపు గాజాలోని పౌరులకు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ముందుకు వస్తున్నాయి. జోర్డాన్‌, ఫ్రాన్స్‌ దేశాలు ఇప్పటికే గాజాలో ఆహారపొట్లాలను విమానం ద్వారా పలుమార్లు జారవిడిచాయి. ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ ఇజ్రాయెల్‌ చర్యను ఖండించారు. గాజా వాసులకు సాయం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. గాజా సిటీలో సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ సైన్యం కాల్పులు జరిపిన ఘటన పట్ల భారత్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button