తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

KCR: కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత.. కమిషన్ ఏం చెప్పిదంటే?

విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రంలో రాజకీయ దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రాష్ట్ర హైకోర్టు జూన్ 28న విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా.. ప్రభుత్వం, కేసీఆర్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వీరి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

అయితే, కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం కొట్టివేసింది. కేసీఆర్ తరపు లాయర్ల వాదనలను హైకోర్టు విభేదించింది. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్న ప్రభుత్వ వాదనలను హైకోర్టు సమర్థించింది. ఇరు వాదనలు తర్వాత విద్యుత్ కొనుగోలు అంశంపై విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ మేరకు కేసీఆర్ రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

ఇదిలా ఉంటే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ సంబంధిత మంత్రి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. ఒక స్పెషల్ జడ్జితో కూడిన కమిషన్ ను నియమించింది. ఇందుకు సంబంధించి ఆ కమిషన్ వెంటనే విచారణ ప్రారంభించింది. అందులో భాగంగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతోపాటు ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నది.

అయితే, నోటీసులపై రెస్పాండైన కేసీఆర్.. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో కూడిన లేఖను రాశారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ అందులో పేర్కొన్నారు. తమ హయాంలో విద్యుత్ విషయంలో గణనీయ మార్పు చూపించామన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందించామన్నారు. ఆ తర్వాత కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఇటు కమిషన్ కూడా కేసీఆర్ కు మరోసారి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button