తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Medaram Jathara: మేడారం జాతరకు భారీ రద్దీ.. రూట్ మ్యాప్ ఇదే!

మేడారం మహాజాతరకు సంబంధించి ఇప్పటికే పలువురు ముందస్తు మొక్కులు సమర్పిస్తుండగా.. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మహాజాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేయడంతో పాటు పోలీసు శాఖ కూడా అన్ని విధాలుగా భక్తలకు సహకారం అందిస్తోంది. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు వేలాది వాహనాలు తరలి వస్తుండగా.. మేడారం రహదారిపై ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు.

Also read: Milan-2024: ముస్తాబైన విశాఖ బీచ్ రోడ్డు.. నేటి నుంచి మిలన్ 2024

ఈ మేరకు నేటి నుంచి జాతర ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించగా, పలుచోట్ల వన్ వే ట్రాఫిక్ కూడా విధించారు. అంతేకాకుండా.. ‘మై మేడారం’ యాప్‌కు తోడు ‘టీఎస్‌ఆర్టీసీ మేడారం జాతర’, ‘మేడారం పోలీస్‌ 2024’ యాప్‌లను సైతం అందుబాటులో ఉంచారు. మరోవైపు మేడారం రూట్‌ మ్యాప్‌ను ములుగు ఎస్పీ శబరీష్‌ విడుదల చేశారు. మేడారం మహాజాతరకు వెళ్లే వాహనాలు ఏయే రూట్లలో ప్రయాణించాలి? ఎక్కడి నుంచి క్రాసింగ్ వెళ్లాలో వివరిస్తూ మేడారం రూట్ మ్యాప్ ప్రకటించారు.

వాహనాల పార్కింగ్ కోసం మేడారంలో 33 పార్కింగ్ స్థలాలను పోలీసులు ఏర్పాటు చేశారు. మేడారం చుట్టుపక్కల 1,400 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. ఆర్టీసీ బస్సులను తాడ్వాయి, మేడారం రూట్ బస్టాండ్ స్థలంలో పార్కింగ్ చేయాలి. మరోవైపు గద్దెలకు దగ్గరే వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ స్థలాలు కేటాయించారు. పస్రా, మేడారం మార్గంలో జంపన్నవాగు సమీపంలో ప్రైవేట్ వాహనాలు నిలిపేందుకు అవకాశం కల్పించారు. భక్తులు వీలైనంత వరకు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also read: ISRO: అరుణగ్రహంపైకి రోబోను పంపనున్న ఇస్రో

మేడారం జాతరకు రూట్ మ్యాప్ ఇలా..

  • హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, హనుమకొండ మీదుగా వచ్చే వాహనాలు ములుగు, పస్రా మీదుగా గూడెప్పాడ్, ఆత్మకూరు మీదుగా వెళ్లాలి. అక్కడి నుంచి నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి.
  • జాతర ముగించుకుని తిరుగు ప్రయాణంలో భూపాలపల్లి, రేగొండ, పరకాల మీదుగా నార్లాపూర్, బయ్యక్కపేట, గొల్లబుద్దారం, కమలాపురం క్రాస్ మీదుగా గూడెప్పాడ్ క్రాస్ దగ్గర కుడివైపునకు వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, హనుమకొండ మీదుగా గమ్యస్థానాలకు వెళ్లవచ్చు.
  • ఖమ్మం, మహబూబాబాద్ నుంచి వచ్చే వాహనాలు నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లికి చేరుకోవాలి. అక్కడి నుంచి ములుగు, పస్రా, నార్లాపూర్ మీదుగా 163 జాతీయ రహదారి మీదుగా మేడారం చేరుకోవాలి. ఈ మార్గంలో వచ్చే వాహనాలకు ఊరట్టం క్రాస్‌ నుంచి ప్రాజెక్ట్‌ నగర్‌ వరకు అన్ని చోట్ల పార్కింగ్‌ స్థలాలు కూడా అందుబాటులో ఉంచారు.
  • ఖమ్మం, మహబూబాబాద్ వైపు వెళ్లే వాహనాలు గూడెప్పాడ్ వద్ద ఎడమవైపు నుంచి ములుగు వైపు వెళ్లాలి. ఆత్మకూరు, కటాక్షపూర్ దాటిన తర్వాత మల్లంపల్లి వచ్చి అక్కడ మలుపు తీసుకుని సొంత గ్రామాలకు వెళ్లవచ్చు.
  • గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపెల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం నుంచి వచ్చే వాహనాలు కాటారం నుంచి చింతకాని, యామన్ పల్లి, పెగడపల్లి, సింగారం, కాల్వపల్లి మీదుగా ఊరట్టం చేరుకోవాలి. అలాంటి వాహనాలకు ఊరట్టం సమీపంలో పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ఈ వాహనాలన్నీ కూడా తిరుగు ప్రయాణంలో అదే మార్గంలో బయలుదేరాలి. అంతే కాకుండా నార్లాపూర్, బయ్యక్కపేట, గొల్లబుద్దారం, కమలాపురం క్రాస్ మీదుగా వెళ్లే అవకాశం కూడా ఉంది.
  • ఛత్తీస్‌గఢ్, భద్రాచలం, మణుగూరు నుంచి వచ్చే వాహనాలు ఏటూరునాగారం, చిన్న బోయినపల్లి, కొండాయి, ఉరట్టం మీదుగా మేడారం చేరుకోవాలి. ఈ వాహనాలన్నీ తిరుగు ప్రయాణంలో వచ్చిన దారిలోనే బయలుదేరాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button