తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

New Year: కొత్త ఆశలతో స్వాగతం.. ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు

కొత్త సంవత్సర వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఆనందోత్సహాల మధ్య జరిగాయి. ఈ వేడుకలో పెద్ద చిన్నా తేడా లేకుండా అందరూ సంబరాల్లో మునిగి తేలారు. పాశ్చాత్య దేశాల్లో మరింత ఉత్సాహంగా వేడుకలు జరిగాయి. మన దేశంలో వాడవాడలా ప్రజలు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి తేలారు. రెస్టారెంట్లు, పబ్ లు, బార్లు, రిసార్ట్స్, హోటళ్లు, పర్యాటక ప్రాంతాలు తదితర చోట్ల కొత్త సంవత్సర వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. ప్రజలు ఆయా ప్రాంతాలు కిటకిటలాడాయి. మద్యం తాగుతూ.. డ్యాన్స్ లు చేస్తూ విందు ఆరగిస్తూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఇక పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా కఠిన ఆంక్షలు విధించింది. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.

Also Read భారత్ కంటే ముందే న్యూ ఇయర్ జోష్‌.. ఏయే దేశాలంటే?

చాలా చోట్ల కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. డీజే పాటలు, సంగీత కచేరీ, డ్యాన్స్ షోలతో ప్రపంచమంతా ఉర్రూతలూగింది. కుటుంబాలతో సహా వచ్చి ప్రజలు ఎంజాయ్ చేశారు. అర్ధరాత్రి 12 దాటక సంబరాలు మరింత హోరెత్తాయి. ఈ సందర్భంగా బాణసంచా వెలుగులతో ఆకాశం కొత్త కాంతులీనింది. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని పరస్పరం కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఫొటోలు దిగి తమ జ్ణాపకాలను పదిలపర్చుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా కొందరు ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త ఆశలతో కొంగొత్త ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి ప్రజలంతా స్వాగతం పలికారు. పక్కా తెలుగు డాట్ కామ్ పాఠకులకు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు.

Also Read భారత్ కంటే ముందే న్యూ ఇయర్ జోష్‌.. ఏయే దేశాలంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button