తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

PM Modi: తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఇవాళ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సమ్మక్క-సారలమ్మల పరాక్రమాన్ని గుర్తు చేసుకొని వారిచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పారు. ‘గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటి.. మేడారం జాతర. భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక ఈ జాతర. సమ్మక్క-సారక్కలకు వందనం చేద్దాం.‘ అని ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ALSO READ: మహాజాతరకు వేళాయె..

కాగా.. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనున్న ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. జాతర కోసం 6 వేల ప్రత్యేక బస్సులు కేటాయించిన ప్రభుత్వం.. ఈ బస్సుల్లోనూ ‘మహాలక్ష్మి’ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు స్పష్టంచేసింది. భక్తుల సౌకర్యార్థం వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంట్లు, ప్రథమ చికిత్స కేంద్రాలు, వాహనాల్లో వచ్చే వారికోసం పార్కింగ్ స్థలాలను కేటాయించింది. ఈ జాతరను దర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button