తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Medaram Bus: మేడారం బస్సులో పొట్టేళ్లు.. టిక్కెట్ కొట్టిన కండక్టర్

తెలంగాణ కుంభమేళా.. వనదేవతల మహాజాతర మేడారంకు భక్తులు భారీ ఎత్తున తరలివెళ్తున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు తల్లిపిల్లలతో కలిసి వెళ్తున్నారు. మూడు, నాలుగురోజుల పాటు ఎంజాయ్ చేస్తారు. దేవతలను దర్శించుకున్నాక.. పచ్చని అడవిలో కుటుంబమంతా కలిసి కోళ్లు, మేకలు, గొర్రెలను అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇలా తమకు ఉన్నంతలో కోళ్లు గానీ, మేకలు గానీ కోస్తారు.

Also read: Hyderabad City Police: కుమారి ఆంటీ డైలాగ్ తో పోలీసుల పోస్ట్.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్

ఇదిలా ఉంటే.. మేడారం జాతరకు బయల్దేరిన ఓ వ్యక్తి మూడు పొట్టేళ్లను ఆర్టీసీ బస్సు ఎక్కించాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. మేడారం జాతరకు తీసుకెళ్లేందుకు గొర్రె పోతులను బస్సులో ఎక్కించాడు. బస్సులో అయితే తక్కువ ఖర్చులో అయిపోతుందని ఊహించిన వ్యక్తి.. బస్సులో తీసుకెళ్తున్నాడు. అయితే కండక్టర్ కూడా వద్దని చెప్పకుండా.. వాటికి టిక్కెట్ కొట్టాడు. పోతే పోనిలే అన్నట్లుగా గొర్రెలను తీసుకెళ్తున్న ప్రయాణికుడు కూడా వాటికి టిక్కెట్ తీసుకున్నాడు. మరోవైపు.. వాటిని బస్సులో ఎక్కించడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే బస్సులో ఉన్న ఓ వ్యక్తి.. ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Also read: Medaram Jathara: మేడారం జాతరకు భారీ రద్దీ.. రూట్ మ్యాప్ ఇదే!

మరోవైపు.. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మేడారం వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలను అనుమతించమని స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ వేలాది బస్సులను మేడారంకు నడుపుతోంది. అయితే వీటిలో మూగజీవాలకు ఎంట్రీ లేదని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తీసుకురాకుండా భక్తులు సహకరించాలని కోరారు. అయినప్పటికీ జనాలు వినకుండా మూగజీవాలను బస్సుల్లో తీసుకెళ్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button