తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Telangana Government: ఫలించిన ఆటో డ్రైవర్ల పోరాటం.. యాదాద్రి కొండపైకి ఆటోలు

యాదగిరిగుట్టపైకి నేటి నుంచి ఆటోలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. నడువనున్నాయి. ఆదివారం ఉదయం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రాకపోకలను జెండా ఊపి ప్రారంభించారు. యాదగిరిగుట్ట ప్రధానాలయం ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం.. 2022 మార్చి 28న కొండపైకి ఆటోలను నిషేధించింది. దీంతో ఆటో డ్రైవర్లు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఘాట్ రోడ్డు సమీపంలో యాదరుషి విగ్రహం వద్ద దాదాపుగా 20 నెలల పాటు దీక్షలు కొనసాగించారు.

Also read: Viral Video: బస్సు సీటు కోసం చెప్పులతో కొట్లాట.. నెటిజన్ల కామెంట్లు

అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పోలీసుల సూచన మేరకు 2023 నవంబర్‌‌‌‌లో దీక్షలు విరమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆటో డ్రైవర్లు, ఆలయ ఉద్యోగులు, పోలీసులతో పలు దఫాలుగా రివ్యూలు చేశారు. సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. నేటి నుంచి కొండపైకి ఆటోలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటో డ్రైవర్ల రెండు సంవత్సరాల సుధీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దీంతో ఆటోడ్రైవర్లంతా ప్రభుత్వానికి, ఎమ్మెల్యే అయిలయ్యకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button