తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Telangana Government: రేవంత్ సర్కారు కీలక నిర్ణయం.. హైదరాబాద్ లో మారనున్న ట్రాఫిక్ రూల్స్

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక.. హైదరాబాద్ ట్రాఫిక్ పై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం అవసరమైతే ట్రాఫిక్ రూల్స్ మార్చేందుకు కూడా వెనుకాడవద్దని ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. దీంతో హైదరాబాద్ సీపీ, ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగారు.

Also read: ECI: ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన.. వచ్చే నెలలో నోటిఫికేషన్?

ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక నుంచి నిరంతరాయంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని, పార్కింగ్‌ను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించకుంటే చలాన్‌ జారీ చేసి జరిమానాలు వసూలు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ వదిలిపెట్టమని తెలిపారు. గూడ్స్ వాహనాలతో రద్దీ పెరుగుతుందని.. నిర్ణీత సమయంలో మాత్రమే నగరం లోపలికి రావాలని సూచించారు. ఇతర సమయాల్లో వస్తే చలాన్లు జారీ చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్‌పై కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నామని.. హైదరాబాద్ ట్రాఫిక్ లెస్ సిటీగా మారుతుందని చెప్పారు.

ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ మాసాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 150 కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమాలకు 35 వేల మంది హాజరయ్యారని తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళితే క్షేమంగా తిరిగి వెళ్లాలని అన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ హైదరాబాద్‌ పేరును కాపాడుకుందామని సీపీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button