తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

TSRTC: టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరక్టర్ గా అపూర్వ రావు… శుభాకాంక్షలు తెలిపిన ఎండీ సజ్జనార్

టీఎస్ఆర్టీసీకి నూతన జాయింట్ డైరక్టర్ గా అపూర్వ రావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్ భవన్ లోని తన ఛాంబర్ లో ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఐడీ, ఎస్పీగా విధులు నిర్వర్తిస్తోన్న అపూర్వరావుని టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ కు చెందిన ఆమె.. 2014 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి.

Also Read: వైఎస్ షర్మిల 9 ప్రశ్నలు…వీటికి వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్

వనపర్తి, గద్వాల, నల్లగొండ ఎస్పీగా గతంలో పనిచేశారు. టీఎస్ఆర్టీసీకి జాయింట్ డైరెక్టర్ గా ఒక మహిళా ఐపీఎస్ అధికారిణి నియమితులవడం ఇదే తొలిసారి. అపూర్వరావుకు సంస్థ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని ఆమెకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button