తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Virushka కోహ్లీ-అనుష్క ఆస్పత్రికి ఎందుకు వెళ్లారు? మరో గుడ్ న్యూస్ ఉంటుందా?

బెంగళూరు: దేశంలో అందమైన జంట ఏదైనా ఉందా అంటే అది విరాట్ కోహ్లీ-అనుష్కదే అని చెప్పాలి. ప్రేమించుకునేటప్పుడు ఎలా ఉన్నారో.. పెళ్లి తర్వాత కూడా అంతే ప్రేమగా ఉన్నారు. వారి ప్రేమ బంధం రోజురోజుకు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. కోహ్లీ (Virat Kohli) కోసం అనుష్క (Anushka Sharma) తన సినీ కెరీర్ ను కాస్త దూరం పెట్టగా.. కోహ్లీ కూడా సాధ్యమైనంత అనుష్కతో ఉండేలా ప్రయత్నిస్తున్నాడు. ఆ జోడీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ వినిపించబోతున్నారని సమాచారం. విరుష్క (Virushka) జోడీ త్వరలో రెండోసారి తల్లిదండ్రులు అవుతున్నారని ప్రచారం సాగుతోంది.

Read Also IndVsAus Match తెలంగాణ పోలీసులపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం

ప్రపంచకప్ (ICC World Cup)లో బిజీగా ఉన్న కోహ్లీ గురువారం బెంగళూరులో (Bengaluru) భార్య అనుష్కతో కలిసి తిరిగారు. అయితే వారిద్దరూ ఓ ఆస్పత్రికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆస్పత్రి (Hospital) నుంచి బయటకు వస్తున్న విరుష్క జోడీని ప్రజలు తమ సెల్ ఫోన్లలో క్లిక్ మనిపించారు. ఆ ఫొటోలు, వీడియోలు చూస్తే అనుష్క గర్భం (Preganant) దాల్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కోహ్లీ, అనుష్క ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అనుష్క మరో బిడ్డకు జన్మనివ్వనుందనే వార్తతో కోహ్లీ అభిమానులు (Fans) తెగ సంబరపడిపోతున్నారు. కాగా, ఇప్పటికే కోహ్లీ-అనుష్క దంపతులకు ఓ పాప ఉన్న విషయం తెలిసిందే. ఆ పాప పేరు వామిక. 2023 జనవరి వస్తే వామిక (Vamika) మూడేళ్లలోకి అడుగుపెడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button