తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Australia: క్రికెట్ కు ఆస్ట్రేలియా కెప్టెన్ గుడ్ బై.. భావోద్వేగంతో కన్నీళ్లు

ఆస్ట్రేలియా క్రికెట్ లేడీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. గొప్ప కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న మెగ్ లానింగ్ ఆస్ట్రేలియా మహిళల జట్టుకు ఐదు ప్రపంచ కప్ టైటిళ్లను అందించింది. మెగ్ లానింగ్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ భాగోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. మెగ్ లానింగ్ 182 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించింది.

అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలగాలనే నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం, కానీ ఇప్పుడు నాకు ఇది సరైన సమయం అని భావిస్తున్నాను. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌ను ఆస్వాదించినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని కెరీర్ లో సహచరులతో పంచుకున్న క్షణాలను ఎంతో మధురమైనవి అని మెగ్ లానింగ్ తెలిపింది. మెగ్ లానింగ్ తన కెరీర్‌లో 241 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించి, 182 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించింది. ఫుల్‌టైమ్‌ బ్యాటర్‌, పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ అయిన ఈమె 17 సెంచరీలు, 38 హాఫ్‌ సెంచరీలు, 5 వికెట్లు పడగొట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button