తెలుగు
te తెలుగు en English
క్రికెట్

BAN VS NZ: రెండో టెస్టు మ్యాచ్‌కు అంతరాయం..కివీస్‌కు ఉపశమనం

బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. రెండో రోజు ఉదయం నుంచి వర్షం కురవడంతో మ్యాచ్ జరగలేదు. బంగ్లాదేశ్‌లోని మిర్పూర్‌లో వ‌ర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉండ‌డంతో ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు డ‌గౌట్‌లోనే ఉండిపోయారు. సాయంత్రం వరకు వర్షం తగ్గకపోవడంతో రిఫరీలు రెండు జ‌ట్ల కెప్టెన్ల‌తో మాట్లాడి మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. దీంతో 55 ప‌రుగుల‌కే స‌గం వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన కివీస్ ఊపిరిపీల్చుకుంది. రేపు య‌థావిధిగా ఉద‌యం న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించ‌నుంది.

ALSO READ: గంభీర్-శ్రీశాంత్ మధ్య గొడవ… అంఫైర్ల జోక్యంతో సద్దుమణిగినా వివాదం

55 పరుగులకే 5 వికెట్లు..

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 66.2 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 12.4 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. కివీస్ టీమ్‌లో ఓపెనర్లు టామ్ లాథమ్ (4), డెవోన్ కాన్వే (11),కేన్ విలియ‌మ్స‌న్‌(13) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. ప్ర‌స్తుతం డారిల్ మిచెల్‌(12 నాటౌట్), గ్లెన్ ఫిలిఫ్స్(5 నాటౌట్‌) ఉన్నారు. బంగ్లా బౌలర్లు మెహదీ హసన్ మీరాజ్ మూడు, తైజుల్ ఇస్లామ్ రెండు వికెట్లు తీశారు. మూడు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టులో గెలుపొందిన బంగ్లా 1-0తో ఆధిక్యంలో నిలిచిన విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button