తెలుగు
te తెలుగు en English
క్రికెట్

David Miller : రికార్డుకెక్కిన మిల్లర్… దక్షిణాఫ్రికా తరుపున మొదటి ఆటగాడిగా చరిత్ర

టీ20 క్రికెట్‌లో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు డేవిడ్ మిల్ల‌ర్ రికార్డు సృష్టించాడు. 10 వేల ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. స్వ‌దేశంలో జ‌రుగుతున్న ఎస్ఏ20 రెండో సీజ‌న్‌లో మిల్ల‌ర్ ఈ ఫీట్ సాధించాడు. పార్ల్ రాయ‌ల్స్‌కు ఆడుతున్న మిల్ల‌ర్ జోబ‌ర్గ్ సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన‌ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో మిల్ల‌ర్ 47 ర‌న్స్ కొట్టాడు. దాంతో టీ20లో 10వేల ప‌రుగుల మైలురాయికి చేరుకున్న తొలి ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడిగా మిల్ల‌ర్ చ‌రిత్ర‌ సృష్టించారు.

Also Read: స్నేహితుడి కోసం కొత్త బ్యాట్ పట్టిన ధోనీ.. ఫోటోలు వైరల్

ఈ ఫీట్‌తో అత‌డు వెస్టిండీస్ మాజీ ఓపెన‌ర్ క్రిస్ గేల్, భార‌త క్రికెట‌ర్ విరాట్ కోహ్లీల స‌ర‌స‌న చేరాడు. మొత్తంగా ఈ ఫార్మాట్‌లో 10 వేల ర‌న్స్ కొట్టిన‌ 12వ క్రికెట‌ర్‌గా ఈ చిచ్చ‌ర‌పిడుగు గుర్తింపు సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్య‌ధిక ర‌న్స్ కొట్టిన స‌ఫారీ క్రికెట‌ర్లలో మిల్ల‌ర్ అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా.. మాజీ కెప్టెన్ డివిలియ‌ర్స్, ఫాఫ్ డూప్లెసిస్‌లు 9 వేల ప‌రుగులు సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button