తెలుగు
te తెలుగు en English
క్రికెట్

ENG VS NED: బెన్‌ స్టోక్స్‌ సెంచరీ.. నెదర్లాండ్స్‌‌కు భారీ టార్గెట్

వన్డే ప్రపంచకప్‌-2023లో ఇవాళ ఇంగ్లండ్‌, నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ తీసుకుంది. తొలత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (84 బంతుల్లో 108, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతకుముందు ఓపెనర్‌ డేవిడ్‌ మలన్‌ (74 బంతుల్లో 87, 10 ఫోర్లు, 2 సిక్సర్లు), క్రిస్‌ వోక్స్‌ (45 బంతుల్లో 51, 5 ఫోర్లు, 1 సిక్స్‌), జో రూట్‌ (35 బంతుల్లో 28, 1 ఫోర్‌) పరుగులు చేశారు.

భారీ భాగస్వామ్యం..

192 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను బెన్‌ స్టోక్స్‌ ఆదుకున్నాడు. క్రిస్‌ వోక్స్‌తో కలిసి ఏడో వికెట్‌‌కు 81 బంతుల్లోనే 129 పరుగుల భాగస్వామ్యం చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లీడె మూడు వికెట్లు పడగొట్టగా వాన్‌ బీక్‌, ఆర్యన్‌ దత్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button