తెలుగు
te తెలుగు en English
క్రికెట్

ENG vs WI: వెస్టిండీస్ చేతిలో ఇంగ్లండ్ చిత్తు… 4 వికెట్ల తేడాతో ఘనవిజయం

బార్బడోస్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో విండీస్‌ కైవసం చేసుకుంది. కాగా కరేబియన్‌ దీవుల్లో ఇంగ్లీష్‌ జట్టుపై విండీస్‌ వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. విండీస్‌ చివరగా తమ స్వదేశంలో 1998లో ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ విజయం సాధించింది.

Also Read: క్రికెట్ లో రిటైర్మెంట్ వ్యక్తిగత నిర్ణయం… ఒత్తిడి చేయకూడదు: గౌతమ్ గంభీర్

తాజా విజయంతో 24 ఏళ్ల నిరీక్షణ​కు వెస్టిండీస్‌ తెరదించింది. వర్షం కారణంగా మూడో వన్డేను 40 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో బెన్‌ డకెట్‌(71) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Also Read:  నేడు భారత్, సౌతాఫ్రికా తొలి టీ20.. కుర్రాళ్లు రాణిస్తారా?

విండీస్‌ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే, జోషఫ్‌య తలా 3 వికెట్లు పడగొట్టగా.. షెపెర్డ్‌ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం విండీస్‌ టార్గెట్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం 188గా నిర్ణయించారు. 188 లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 31.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి విజయం సాధించింది. కరేబియన్‌ బ్యాటర్లలో ఆథనాజ్‌(45), కార్టీ(50) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో విల్‌ జాక్స్‌ 3 వికెట్లు.. అటిక్కినిసన్‌ 2, ఆహ్మద్‌ ఒక్క వికెట్‌ పడగొట్టారు. విండీస్‌ కెప్టెన్‌ షాయ్‌ హోప్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌ అవార్డు దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button