తెలుగు
te తెలుగు en English
క్రికెట్

England: టైమ్డ్ ఔట్ నుంచి తప్పించుకున్న మరో బ్యాటర్..ఏం చేశాడో?

వరల్డ్ కప్ లో టైమ్డ్ ఔట్ విధానంతో శ్రీలంక సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ పెవిలియన్ కు చేరడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం తొలి బంతిని ఎదర్కోవడానికి బ్యాటర్ కు 2 నిమిషాల సమయాన్ని ఇస్తారు. అయితే మాథ్యూస్ హెల్మెట్ సరిగా లేని కారణంగా బ్యాటింగ్ చేసేందుకు ఈ 2 నిమిషాల సమయం మించిపోయింది. దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ అప్పీల్ చేయడంతో అంపైర్ అవుట్ గా ప్రకటించారు.

క్రికెట్ చరిత్రలో మాథ్యూస్ బంతిని ఆడకుండానే టైమ్డ్ ఔట్ గా వెనుదిరిగాడు. దీనిపై పెద్ద చర్చ జరిగింది. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే ఇంగ్లాండ్ ఆటగాడు క్రిష్ వోక్స్ కు ఎదురైంది. బుధవారం ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వోక్స్ కూడా హెల్మెట్ సమస్యలను ఎదుర్కున్నాడు. అయితే అంతలోనే అప్రమత్తమై ఈ విషయాన్ని అంపైర్ తో పాటు నెదర్లాండ్స్ బౌలర్ కు చెప్పాడు. దీంతో లేట్ అయినా తన పరిస్థితి గురించి అంపైర్ కు వివరించడంతో బతికిపోయాడు.

అయితే శ్రీలంక, ఇంగ్లాండ్ ఈ రెండు మ్యాచ్ లకు అంపైర్ ఎరాస్మస్ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 160 పరుగుల భారీ తేడాతో గెలిచింది. వరుసగా 5 ఓటముల తర్వాత ఇంగ్లాండ్ ఈ విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button