తెలుగు
te తెలుగు en English
క్రికెట్

ICC Rankings: నేనే నంబర్ వన్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఫ‌స్ట్ ప్లేస్ మనోళ్లే

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు టాప్ ప్లేస్ కొట్టేశారు. తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో బౌలింగ్‌లో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, బ్యాటింగ్‌లో యువ కెరటం శుభ్‌మన్‌ గిల్ నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని కైవ‌సం చేసుకున్నారు. బ్యాటింగ్‌లో గత కొంతకాలంగా టాప్‌లో ఉన్న పాకిస్తాన్ బ్యాటర్ బాబ‌ర్‌ను గిల్ వెనక్కి నెట్టేశాడు. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్ 830 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. బాబర్‌ అజామ్‌ 824 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. వన్డే ప్రపంచకప్‌లో గిల్.. శ్రీలంకపై 92 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తోపాటు సౌతాఫ్రికాతో 23 ర‌న్స్ చేశాడు. దీంతో బాబర్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. అలాగే క్వింటన్ డికాక్‌ (771), విరాట్ కోహ్లీ (770), డేవిడ్ వార్నర్ (743) తర్వాతి స్థానాల్లో నిలిచారు. దీంతో పాటు నంబర్ వన్ స్థానాన్ని ఆక్ర‌మించిన నాల్గో భారత్ బ్యాట‌ర్‌గా నిలిచాడు. గ‌తంలో స‌చిన్ టెండూల్క‌ర్‌, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ మాత్ర‌మే నంబ‌ర్ వ‌న్ ర్యాంకు స్థానాన్ని ఆక్ర‌మించారు.

సిరాజ్‌.. అద్భుత ప్రదర్శన

బౌల‌ర్ల‌ విషయానికొస్తే.. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ 709 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. దక్షిణాఫ్రికా, శ్రీలంకపై అద్భుత ప్రదర్శనతో రెండు స్థానాలకు ఎగబాకిన సిరాజ్‌.. వ‌న్డేల్లో నంబ‌ర్ వ‌న్ బౌల‌ర్ అయ్యాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్‌ మహరాజ్ 694 పాయింట్లతో రెండో స్థానం.. ఆసీస్‌ స్పిన్నర్ ఆడమ్ జంపా 662 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. కుల్దీప్ యాద‌వ్ 4వ స్థానం. బుమ్రా 8, ష‌మీ 10వ స్థానంలో నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button