తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IND vs ENG: రూట్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్

రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్.. 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత జో రూట్‌ నెమ్మడిగా ఆడి సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. అంతకుముందు జాక్‌ క్రాలే (42), బెన్‌ డకెట్‌ (11), ఓలీ పోప్‌ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్‌ స్టోక్స్‌ (3), బెన్‌ ఫోక్స్‌(47), టామ్‌ హార్ట్లీ (13) ఔట్‌ అయ్యారు. కాగా, ప్రస్తుతం రూట్‌ (106), రాబిన్సన్‌ (31) క్రీజ్‌లో ఉన్నారు.

ALSO READ: ఇంగ్లాండ్ కు భారీ షాక్.. సిరీస్ నుంచి కీలక ఆటగాడు ఔట్

రూట్.. అరుదైన రికార్డులు

రూట్‌ చేసిన ఈ సెంచరీ టెస్ట్‌ల్లో ఆయనకు 31వది కాగా, అన్ని ఫార్మాట్లలో 47వ సెంచరీ. ఈ సెంచరీతో రూట్‌ అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ శర్మతో (47) కలిసి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. డేవిడ్‌ వార్నర్‌ రెండో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా భారత్‌పై అత్యధిక టెస్ట్‌ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా రూట్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు స్టీవ్‌ స్మిత్‌ పేరు మీద ఉన్న రికార్డును (9) అధిగమించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button