తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IND VS ENG: నాలుగో టెస్టు మనదే.. ఇంగ్లండ్‌పై ఘనవిజయం

రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు విధించిన లక్ష్యాన్నిసులభంగా చేధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రోహిత్ శర్మ (55), యశస్వి జైస్వాల్ (11), గిల్(52 నాటౌట్), రజత్ పాటిదార్ (0), రవీంద్ర జడేజా (4), సర్ఫరాజ్ ఖాన్(0), జురెల్(39 నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 , టామ్ హార్ట్లీ, జో రూట్ చెరో వికెట్‌ తీశారు.

ALSO READ: గెలుపు దిశ‌గా భార‌త్.. ఎన్ని పరుగులు చేయాలంటే?

3-1తో సిరీస్ కైవసం

ఓవ‌ర్ నైట్ స్కోర్ 40తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్.. బ‌షీర్, హ‌ర్ట్లే విజృంభ‌ణ‌తో 100 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో జ‌డేజా, గిల్‌లు నాలుగో వికెట్‌కు 71బంతుల్లో 20 పరుగులు జోడించారు. లంచ్ త‌ర్వాత రెండో ఓవ‌ర్లో బ‌షీర్ మళ్లీ దెబ్బ తీశాడు. జ‌డేజాను ఔట్ చేయడంతో పాటు ఆ త‌ర్వాతి బంతికే స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌(0)ను డకౌట్ చేసి భారత్‌ను క‌ష్టాల్లోకి నెట్టాడు. చివరికి గిల్‌(52)కు జురెల్(37) తోడవడంతో విజయం సులభమైంది. ఈ విజయంతో ఇంకా ఒక్క మ్యాచ్ ఉండగానే.. 3-1తో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button