తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IND VS SA: సఫారీలకు బిగ్ షాక్.. టీ20 సిరీస్‌కు స్టార్ ఆటగాడు దూరం

భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ముందే దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ లుంగి ఎంగిడి గాయం కార‌ణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. కాగా, ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో ఎడమ కాలికి గాయం కావడంతో కొన్నిరోజులవరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లుంగిడి కోలుకునేందుకు రెండువారాల సమయం పట్టనున్నట్లు సమాచారం.

ALSO READ: ఆసియా కప్ అండర్ 19 టోర్నీ.. బోణీ కొట్టిన భారత్

జట్టులోకి బురాన్ హెండ్రిక్స్..

వన్డే ప్రపంచకప్‌లో లుంగి ఎంగిడి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో 10 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆయనపై సఫారీలు ఆశలు పెట్టుకున్నారు. అయితే భారత్‌తో జరిగే మూడు టీ20 సిరీస్‌కు దూరం కావడంతో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే తర్వాత జరిగే రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు అవకాశం ఉంటుందని సమాచారం. కాగా, లుంగి ఎంగిడి స్థానంలో బురాన్ హెండ్రిక్స్‌ జ‌ట్టులోకి తీసుకుంటున్నట్లు సెలక్టర్లు తెలిపారు. కాగా, హెండ్రిక్స్ 19 మ్యాచ్‌లు ఆడగా.. 25 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button