తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IND vs SA: రెండోటెస్టులో భారత్ విక్టరీ.. సిరీస్ డ్రా

కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న రెండోటెస్టులో దక్షిణాఫ్రికాను భారత్‌ చిత్తు చేసింది. తొలత టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా.. సిరాజ్‌, బుమ్రా, ముకేశ్‌ ధాటికి దక్షిణాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కూప్పకూలింది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ బ్యాటర్లు సైతం తడబడ్డారు. దీంతో రోహిత్ సేన 153 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా.. రెండో ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది.

ALSO READ: ఫస్ట్ సిరాజ్.. సెకండ్ బుమ్రా.. సౌతాఫ్రికా విలవిల

షాక్ ఇచ్చిన బుమ్రా..

రెండో రోజు మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే దక్షిణాఫ్రికాకు బుమ్రా షాక్ ఇచ్చాడు. బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే బెడింగ్‌హమ్‌ (11)ను ఔట్ చేశాడు. తర్వాత వెరీన్‌ (9)ను సైతం ఔట్‌ చేశాడు. కాగా, ఓపెనర్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (103 బంతుల్లో 106, 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేశాడు. మిగిలిన బ్యాటర్లు వరుసగా విఫలం కావడంతో 36.5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 176 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం 79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ALSO READ: విరాట్ కోహ్లి పేరిట అరుదైన రికార్డు

సిరీస్ సమం..

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 79 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(23 బంతుల్లో 28 పరుగులు, 6ఫోర్లు) దూకుడుగా ఆడి నాండ్రే బర్గర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్(11 బంతుల్లో 10), విరాట్ కోహ్లి(11 బంతుల్లో 12) నిరాశ పరిచాడు. ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ(22 బంతుల్లో 17 పరుగులు), శ్రేయస్ అయ్యర్‌(4)తో కలిసి విజయాన్ని అందించారు. భారత్ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. దీంతో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. తొలి టెస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలుపొందగా.. రెండో టెస్ట్ మ్యాచ్ భారత్ గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ డ్రాగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button