తెలుగు
te తెలుగు en English
క్రికెట్

India: బిజీ బీజీగా టీమిండియా.. మ్యాచ్ ల షెడ్యూల్ ఇదే

భారత క్రికెట్ టీం ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా 3 టీ20 లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టులు ఆడాల్సి ఉంది. డిసెంబర్ 10 నుంచి టీ20 సిరీస్ తో సఫారీల టూర్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా 2024 లో భారత్ ఆడబోయే షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాది టీమిండియా ఎక్కువ టెస్టులు ఆడనున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. 2023 లో తక్కువ టెస్టులు ఆడిన భారత క్రికెట్ జట్టు రానున్న 14 నెలల్లో ఏకంగా 17 టెస్టులు ఆడనుంది. ఈ టెస్టులు ఎవరితో ఎప్పుడు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం.

Also read: ICC: ఐసీసీ ర్యాంకింగ్స్.. సత్తా చాటిన భారత ప్లేయర్లు

టెస్టు ఛాంపియన్ షిప్ 2025 లో భాగంగా ఇప్పటివరకు భారత్ వెస్టిండీస్ తో రెండు టెస్టులు మాత్రమే ఆడింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్ లో ఉన్న భారత్ రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ టూర్ తర్వాత ఇంగ్లాండ్ తో జనవరి 25 నుంచి స్వదేశంలో 5 టెస్టుల సిరీస్ ప్రారంభం అవుతుంది. ఇక ఆగష్టులో బంగ్లాదేశ్ తో మన గడ్డపై రెండు టెస్ట్ సిరీస్ ల సిరీస్, సెప్టెంబర్ లో న్యూజీలాండ్ పై భారత్ వేదికగా 3 టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇక డిసెంబర్ లో ఆస్ట్రేలియాతో 5 టెస్టుల కోసం ఆసీస్ గడ్డపై అడుగుపెట్టనుంది.

టెస్టు ఛాంపియన్ షిప్ లో వరుసగా రెండు సార్లు ఫైనల్ కు వెళ్లగా 2021 లో న్యూజీలాండ్ పై, 2023 లో ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. మరి 2025 టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తుందేమో చూడాలి. 2024లో మెగా టోర్నీ టీ20 వరల్డ్ కప్ ఉండగా.. ఈ ఏడాది భారత్ కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button