తెలుగు
te తెలుగు en English
క్రికెట్

India Vs Australia: భారత్, ఆసీస్ మధ్య నేడు నాలుగో టీ20.. ఆతిథ్య జట్టు సిరీస్ పట్టేనా

భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. సా. 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి రెండు మ్యాచ్ లలో భారత్ పైచేయి సాధించగా.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్ ఆశలను సజీవం చేసుకుంది. ఇక మరి నేడు రాయపూర్ వేదికగా జరగనున్న మ్యాచ్ లో భారత్ సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోండగా.. ఆసీస్ కూడా ఆదేస్థాయిలో ప్రయత్నిస్తోంది.

Also read: ICC T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సిరీస్.. షెడ్యూల్ లో స్వల్ప మార్పులు

ఇక ఈ సిరీస్ లో భారత్ బ్యాటింగ్ బాగుంది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సూపర్‌ ఫామ్‌ పెద్ద సానుకూలాంశం. యశస్వి జైస్వాల్, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్, రింకూ సింగ్‌తో లైనప్‌ బలంగా ఉంది. ఇక చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్‌ అయ్యర్‌ అందుబాటులోకి వచ్చాడు. దాంతో హైదరాబాదీ ప్లేయర్‌ తిలక్‌ వర్మపై వేటు పడే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో తిలక్‌ కూడా పెద్దగా రాణించలేదు. మొడటి రెండు టీ20లలో అతడు విఫలమయ్యాడు.

ఇక భారత్ జట్టుకు బౌలర్లు దడ పుట్టిస్తున్నారు. యువ బౌలర్లు భారీగా పరుగులు ఇస్తున్నారు. సిరీస్ నెగ్గాలంటే ఆఖరి ఓవర్లలో బౌలింగ్ బాగా ఉండాలి. ఇక మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు చివరి రెండు ఓవర్లలో ఏకంగా 40కి పైగా పరుగులను కాపాడలేకపోయారు. ప్రసిద్ధ్‌, అవేష్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ భారీగా పరుగులు ఇస్తున్నారు. ఇక మ్యాక్స్‌వెల్‌, స్మిత్‌, జంపా వంటి కీలక ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోయినా.. ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ తుది జట్టులో అనేక మార్పులు జరగనున్నాయి. రాయపూర్‌ పిచ్ సాధారణ బ్యాటింగ్‌ పిచ్ కనుక.. మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button