తెలుగు
te తెలుగు en English
క్రికెట్

India Vs England: భారత్ కు పెనాల్టీ.. బ్యాటింగ్ చేయకుండానే ఇంగ్లాండ్ కు 5 రన్స్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియాకు అనుకోని విధంగా షాక్ తగిలింది. ఇంగ్లాండ్ కు ఫ్రీగా 5 పరుగులు సమర్పించుకుంది. దీంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్ 0 వద్ద కాకుండా 5 పరుగులతో ప్రారంభిస్తుంది.

Also read: BCCI: రోహిత్ సారథ్యంలోనే టీ20 వరల్డ్ కప్ సిరీస్.. ప్రకటించిన బీసీసీఐ

భారత్ ఇన్నింగ్స్ 102 ఓవర్లో రెహన్ అహ్మద్ బౌలింగ్ లో అశ్విన్ డిఫెన్స్ ఆడాడు. అయితే ఈ సమయంలో అశ్విన్ పిచ్ మధ్యలో పరిగెడుతున్నాడని.. అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయంలో భారత్ కు 5 పరుగుల పెనాల్టీని విధించారు. దీని ప్రకారం ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు అదనంగా ఇస్తారు. ఈ టెస్టులో తొలి రోజు కూడా అంపైర్ భారత్ కు వార్నింగ్ ఇచ్చాడు. అయితే అదే తప్పు ఈ రోజు రిపీట్ కావడంతో భారత జట్టుకు పెనాల్టీ తప్పలేదు.

అసలు 5 పరుగులు ఇచ్చే రూల్ ఏంటి?

నిబంధనల ప్రకారం.. పిచ్‌పై ఉన్న ప్రొటెక్టెడ్ ఏరియాలో పరుగులు పెట్టడాన్ని ‘అనైతిక ఆట’ గా పరిగణిస్తారు. పిచ్‌కు ఉద్దేశపూరితంగా నష్టం కలిగించడం అనైతికం. స్ట్రైకర్‌ బంతిని ఆడేప్పుడు ప్రొటెక్టెడ్‌ ఏరియాలోకి వస్తే వెంటనే అక్కడి నుంచి కదలాలి. ఎలాంటి కారణం లేకుండా బ్యాటర్‌ ఆ ప్రాంతంలోకి వస్తే అంపైర్‌ దాన్ని తప్పిదంగా భావిస్తాడు. దీనిపై బ్యాటింగ్‌ జట్టుకు ఇన్నింగ్స్‌ మొత్తంలో ఒకసారి వార్నింగ్‌ ఇస్తారు. బ్యాటర్‌తో సంబంధం లేకుండా జట్టు రెండోసారి ఇదే తప్పిదం చేస్తే.. ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు. మూడో టెస్టు తొలి రోజు మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్‌ జడేజా కూడా గురువారం ఇలాగే ప్రవర్తిస్తే అంపైర్‌ హెచ్చరించాడు. అయితే ఇవాళ అశ్విన్‌ కూడా పిచ్‌ మధ్యలో పరిగెత్తడంతో రెండో తప్పిదంగా పరిగణించి టీమిండియాకు జరిమానా విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button