తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IPL 2024: ఐపీఎల్‌‌లో కొత్త రూల్.. ఇక హిట్టర్లకు కష్టమే!

ఐపీఎల్‌ లీగ్ ఈఏడాది ఆసక్తికరంగా జరగనుంది. చాలా ఫ్రైంఛైజీల్లో ఆటగాళ్లు తారుమారయ్యారు. కాగా, ఈసారి ఐపీఎల్‌‌లో కొత్త రూల్ తీసుకొస్తున్నారు. అంతకుముందు ఏడాది ‘ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్’ నిబంధ‌న‌తో కొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికిన‌ బీసీసీఐ తాజాగా బౌల‌ర్ల‌కు మేలు చేసే రూల్ తీసుకురానుంది. ఎందుకంటే ఐపీఎల్‌‌లో పూర్తిగా బ్యాట్స్‌మన్‌దే ఆధిపత్యం నడుస్తోంది. ఒక్కోసారి బ్యాట్స్‌మన్ ఒక్క ఓవర్లో ఆరు బంతులను సైతం సిక్సులుగా కొట్టగలడు. ఇందుకోసమే పేస్‌ బౌలర్‌కు ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసే నిబంధన తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: రోహిత్‌ ఫ్యూచర్‌పై సందిగ్దత.. టీ20 ప్రపంచకప్‌ ఆడతారా?

ఫాస్ట్ బౌల‌ర్ల‌కు రెండు బౌన్స‌ర్లు

పేస్‌ బౌలర్‌కు ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసే నిబంధనను తీసుకురావాలని పలువురు సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బౌండరీలే లక్ష్యంగా బ్యాట్స్‌మెన్‌ విరుచుకుపడే ఐపీఎల్ ఫార్మాట్‌లో ఒక ఓవ‌ర్లో ఫాస్ట్ బౌల‌ర్ల‌కు రెండు బౌన్స‌ర్లు సంధించేందుకు అనుమ‌తించనున్నారు. దీంతో ప‌వ‌ర్ హిట్ల‌ర్ల‌ను కాస్తా అదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ కొత్త నిబంధ‌న‌ను బీసీసీఐ దేశ‌వాళీ క్రికెట్‌లో ప‌రీక్షించింది. ఇటీవల జ‌రిగిన స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వ‌ర్క‌వుట్ కావ‌డంతో ఐపీఎల్‌లోనూ దీన్ని అమలు చేయ‌నున్నార‌ని సమాచారం.

5 Comments

  1. Thanks for any other fantastic article. Where else could anybody get that type of info in such a perfect method of writing?
    I have a presentation subsequent week, and I am on the search for such info.

    Feel free to visit my webpage … vpn code 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button