తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Mitchell Marsh: కండకావరం.. ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి ఫోజులు

కోట్లాది మంది భారతీయులను నిరాశపరుస్తూ ప్రపంచకప్ (ICC Worldcup)ను ఆస్ట్రేలియా ఎగురేసుకుపోయింది. అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా జరిగిన తుది పోరులో భారత్ (India)ను చిత్తు చేసి ఆసీస్ ట్రోఫీని ఆరోసారి ముద్దాడింది. అక్కడి వరకు బాగానే గెలిచిన తర్వాత ఆసీస్ (Australia) ఆటగాళ్లు చేసి ప్రవర్తన.. వారి చేష్టలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇంతకీ ఏం చేశాడంటే..

Also Read  భారత్ ఓటమి తట్టుకోలేక ఐటీ ఉద్యోగి హఠాన్మరణం

ప్రపంచకప్ సాధించిన అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లారు. అక్కడ సంబరాలు (Celebrations) చేసుకున్న అనంతరం సేదతీరారు. అయితే మార్ష్ మాత్రం అతిగా ప్రవర్తించాడు. ప్రపంచకప్ ట్రోఫీపై (Trophy) కాళ్లు పెట్టి ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. సోఫాలో కూర్చొని ఎదురుగా ప్రపంచకప్ పెట్టి దానిపై మార్ష్ కాళ్లు పెట్టాడు. ఈ ఫొటోలను కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. అవి చూసిన వారంతా మండిపడుతున్నారు. మార్ష్ తీరుపై భారతీయులే కాదు క్రికెట్ అభిమానులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలిచారు సరే కానీ ఇలా ప్రవర్తించడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు.

Also Read  ప్రపంచకప్ హీరో మహ్మద్ షమీకి అదిరిపోయే గిఫ్ట్ రెడీ..

‘అంత బలుపు.. కండకావరం ఎందుకు’ అంటూ కొందరు నెటిజన్లు (Netizens) తీవ్రస్థాయిలో మార్ష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఫైనల్లో భారత్ (Indian Team) ను 6 వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచిన విషయం తెలిసిందే. భారత్ మూడోసారి ప్రపంచకప్ కైవసం చేసుకుంటుందనే కల తీరకపోవడంతో యావత్ భారతదేశం నిరాశ చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button