తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Nephew-Uncle Duo in Cricket: క్రికెట్‌ చరిత్రలో అరుదైన సన్నివేశం.. బరిలోకి దిగిన మామాఅల్లుళ్లు

క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు అన్నాతమ్ముళ్లు, కవలలు, అక్కా చెల్లెళ్లు ఆడిన సందర్భాలు చూశాం. కానీ తాజాగా, మేనమామ, అల్లుడు కలిసి క్రికెట్‌ ఆడిన అరుదైన సన్నివేశం నమోదైంది. బుధవారం ఐర్లాండ్‌, అఫ్గానిస్తాన్‌ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గాన్‌ తరఫున స్టార్‌ బ్యాటర్‌గా ఉన్న ఇబ్రహీం జద్రాన్‌.. తన మేనమామ నూర్‌ అలి జద్రాన్‌తో కలిసి అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌ ఆడారు. అయితే నూర్‌ అలీకి 35 ఏళ్లు కాగా, ఇబ్రహీం వయసు 22 మాత్రమే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

ALSO READ: మరోసారి తండ్రైన కేన్ మామ.. విష్ చేస్తున్న ఫ్యాన్స్

మళ్లీ టెస్టు జట్టులో చోటు..

ఐర్లాండ్‌తో అబుదాబి వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో నూర్‌ అలీ జద్రాన్‌.. అంతకుముందు 2009లో అఫ్గాన్‌ తరఫున వన్డేలు ఆడారు. ఆ తర్వాత పలు కారణాలతో జట్టుకు దూరమై మళ్లీ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టులో నూర్‌ అలీ.. తన అల్లుడైన ఇబ్రహీం జద్రాన్‌ చేతి నుంచే అరంగేట్ర క్యాప్‌ అందుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button