తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Rohit Sharma: రోహిత్‌ ఫ్యూచర్‌పై సందిగ్దత.. టీ20 ప్రపంచకప్‌ ఆడతారా?

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యా పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా హార్ధిక్‌ పాండ్యా సారథ్యం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది టీ20 వరల్డ్‌ కప్‌లో సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి తర్వాత రోహిత్‌ మళ్లీ భారత్‌ తరఫున టీ20 ఆడలేదు. సెలక్టర్లు కూడా రోహిత్‌ను పక్కనబెట్టి హార్ధిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పజెప్పారు.

ALSO READ: ఐపీఎల్‌ చరిత్రలో మొదటి మహిళా వేలం నిర్వాహకురాలు.. ఆమె ఎవరో తెలుసా?

రోహిత్ ఆడే అవకాశాలు తక్కువే..

వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఎవరు ఉంటారనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ ఆడతాడని జట్టును అతనే లీడ్ చేస్తాడని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హిట్‌మ్యాన్‌ను తప్పించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆడినా కెప్టెన్‌గా ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ అతడి సారథ్యంలోనే బరిలోకి దిగుతుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచకప్‌కు మరో ఆరు నెలల సమయం ఉండటంతో అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button