తెలుగు
te తెలుగు en English
క్రికెట్

World Cup Records రికార్డు సృష్టించిన ప్రపంచకప్.. ఎంతమంది చూశారంటే..

క్రికెట్ అంటే భారతీయులకు మాంచి కిక్కిచ్చే ఆట. గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు భారతీయులు క్రికెట్ (Cricket) ను ఆదరిస్తారు. ఎక్కడైనా ఎవరైనా క్రికెట్ ఆడుతుంటే మనకు ఆడాలనిపిస్తుంది. నేను కూడా బ్యాటింగ్ చేయొచ్చా.. నేను ఆడుతా అని అడగాలనిపిస్తుంది కదా! మరి అలాంటి భారతీయులకు స్వదేశంలో వన్డే ప్రపంచకప్ (ICC World Cup) వదులుతారు. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ ఈవెంట్ ను భారతీయులు (Indians) తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read కోహ్లీ-అనుష్క ఆస్పత్రికి ఎందుకు వెళ్లారు? మరో గుడ్ న్యూస్ ఉంటుందా?

ఈ మెగాటోర్నీకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహించని స్పందన లభించింది. అభిమానులు పెద్ద ఎత్తున క్రికెట్ ను ఆదరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచకప్ ను ఎంత మంది వీక్షించారో (Watched) తెలుసా! ఏకంగా 10 లక్షల మందికి పైగా నేరుగా స్టేడియాల్లో వీక్షించారు. ప్రపంచకప్ లో ఇంకా సెమీస్, ఫైనల్ మ్యాచ్ లు ఉన్నాయి. ఆ మ్యాచ్ లను లెక్కిస్తే ఈ సంఖ్య దాదాపు 13 లక్షలు దాటుతుందని అంచనా.

ప్రపంచకప్ మ్యాచ్ లు స్టేడియంలో (Stadium) నేరుగా వీక్షించిన సంఖ్య 10 లక్షల మందికి దాటింది. ఐసీసీ క్రీడా వేడుకల చరిత్రలో ఇంత సంఖ్యలో ప్రేక్షకులు వచ్చిన తొలి టోర్నీ ఇదే కావడం విశేషం. అహ్మదాబాద్ లో దక్షిణాఫ్రికా- అఫ్గానిస్థాన్ మ్యాచ్ (Match) పూర్తయ్యే సరికి స్టేడియానికి వచ్చి వీక్షించిన అభిమానుల సంఖ్య 10 లక్షలు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘10 లక్షల మందికి పైగా అభిమానులు స్టేడియానికి వచ్చి మ్యాచ్ లను చూడడం వన్డే ఫార్మాట్ కు ఆదరణ తగ్గలేదని నిరూపిస్తోంది. ప్రపంచకప్ విలువ ఏమిటో వీక్షకుల సంఖ్య పెరగుతుండడమే నిదర్శనం’ అని ఐసీసీ ఈవెంట్స్ అధిపతి క్రిస్ టెట్లీ (Chris Tetly) తెలిపాడు. కాగా, ప్రపంచకప్ మొత్తం పూర్తయ్యే సరికి వీక్షకుల సంఖ్య మరింత పెరగనుంది. ఇక టీవీలు, ఓటీటీ వేదికల్లో వీక్షకుల (Viewers) సంఖ్య రికార్డులు సృష్టిస్తోంది. ఈ లెక్కలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ పది కోట్ల మందికి పైగా చూసి ఉంటారని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం ప్రపంచకప్ ముగిసే వరకు ఎంత మంది చూసి ఉంటారో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button