Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ వీడియో… వ్యక్తి అరెస్ట్
సినీ నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో భాగంగా ఏపీకి వచ్చిన ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఒరిజినల్ వీడియో బ్రిటీష్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ కు చెందినది. ఈ వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి రష్మిక వీడియోగా మార్ఫింగ్ చేశారు.
Also Read: ‘హనుమాన్’ సినిమా కలెక్షన్స్.. 8 రోజుల్లో ఎంతంటే?
రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 465, 469, ఐటీ సెక్షన్లు 66సీ, 66ఈ ల కింద అభియోగాలు మోపారు. మరోవైపు కాజోల్, కత్రినా కైఫ్, అలియా భట్, సచిన్ టెండల్కర్ డీప్ ఫేక్ వీడియోలు కూడా వైరల్ అయ్యారు. తాజాగా సోనూసూద్ వీడియో నెట్టింట ప్రత్యక్షమయింది. డీప్ ఫేక్ వీడియోల పట్ల దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: దేవుడు నమ్మకం, వైఎస్ఆర్ నిజం… ‘యాత్ర 2’ నుంచి సాంగ్ రిలీజ్
ఈ సంఘటనలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మొట్ట మొదట రష్మికకి మద్దతు తెలిపారు. ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలు రష్మిక కి సపోర్ట్ చేయడం.. డీప్ ఫేక్ వీడియోల్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దీనిపై లీగల్ యాక్షన్స్ కూడా మొదలు పెట్టారు.