Google: గూగుల్ మ్యాప్స్‌లో మరో సరికొత్త ఫీచర్
గూగుల్ మ్యాప్స్ యాప్ వినియోగదారులకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ మరో శుభవార్త చెప్పింది. గూగుల్ మ్యాప్స్ యాప్‌లో యూజర్ల ప్రైవసీ కోసం ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసిన లొకేషన్ నావిగేషన్ హిస్టరీ డైరెక్ట్ డివైస్‌లో సేవ్ అవుతుంది. ఇప్పటి వరకు లొకేషన్ హిస్టరీ గూగుల్ క్లౌడ్‌లో సేవ్ అయ్యేది. కానీ ఇకపై నేరుగా వారు వాడే డివైస్‌లోనే స్టోర్ అవ్వనుంది. వినియోగదారులు గోప్యత కోసమే ఈ అప్డేట్ తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.
ALSO READ: ఆసక్తికరంగా ఏపీ రాజకీయాలు.. సాయంత్రంలోపు కొత్త సీఎస్?
క్లౌడ్ లో సేవ్ అయితే వేరేవాళ్లు ఆ డేటాని సులభంగా తెలుసుకోవచ్చు. నేరుగా మొబైల్లోనే సేవ్ అయితే కేవలం యూజర్ మాత్రమే లొకేషన్ హిస్టరీ డేటా మ్యానేజ్ చేసుకోవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లు రెండిట్లో ఈ అడ్డేట్ వచ్చింది. క్లౌడ్‌తో పోల్చుకుంటే డివైస్‌లో గూగుల్ మ్యాప్స్ హిస్టరీ డేటా సేవ్ అయితే యూజర్ల ప్రైవసీ మెరుగవుతుందని గూగుల్ పేర్కొంది.
One Comment