తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Dunki Movie OTT: ఓటీటీలోకి ‘డంకీ’.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘డంకీ’. ఈ సినిమాకు రాజ్​కుమార్​ హిరానీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. గతేడాది సలార్‌కు పోటీగా డిసెంబర్‌ 21న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదు అనిపించింది. దీంతో రూ. 470 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. తాజాగా, ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మేరకు మేకర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు.

సైలెంట్‌గా వచ్చేసింది..

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. కాగా, ఈ సినిమా జనవరిలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో రాలేదు. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా ఈ సినిమాను సైలెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. ఇక, 2023లో పఠాన్‌, జవాన్‌ చిత్రాలతో షారుక్‌ ఖాన్‌ రెండు బ్లాక్‌ బస్టర్‌లను అందుకున్నాడు. కానీ, ఈ సినిమా ఆ రెండు సినిమాల కంటే కొంత నిరాశ పరిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button