తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Fighter teaser: హృతిక్ రోషన్ ‘ఫైటర్’ … గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ న‌టిస్తున్న తాజా చిత్రం ఫైటర్. సిద్దార్థ్‌ ఆనంద్ దర్శకత్వంలో వ‌స్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే , అనిల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. షారుక్ ఖాన్‌తో పఠాన్ లాంటి 1000 కోట్ల సినిమా అందించిన సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా యాక్షన్ లవర్స్ ను ఆకట్టుకునేలా ఉంది.

Also Read: యష్ కొత్త సినిమా.. టైటిల్ వీడియో విడుదల

తఒక్క డైలాగ్ లేకుండా టీజ‌ర్ మొత్తం యాక్ష‌న్ సన్నివేశాలతో ఉంది. మమ్మల్ని కనుగొనాలంటే? మీరు మంచివారై ఉండాలి. మమ్మల్ని పట్టుకోవాలంటే? మీరు వేగంగా ఉండాలి. మమ్మల్ని ఓడించాలంటే? మీరు జోక్ చేయాలంటూ డైలాగ్స్‌తో టీజ‌ర్ ఉండ‌గా.. హృతిక్ రోషన్, దీపికా పదుకొనేల‌ అసాధారణ నైపుణ్యాల‌ను హైలైట్ చేసే విధంగా టీజ‌ర్ సాగింది. వీళ్లంతా ఓ మిషన్ పై తమ ఫైటర్ జెట్స్ లో వెళ్తారు. అవి గాల్లోకి ఎగిరిన మరుక్షణం నుంచీ జెట్స్ చేసే స్టంట్స్ ఊపిరి బిగపట్టి చూసేలా ఉన్నాయి. నిమిషం టీజర్ తోనే ఇంతలా ఊపేస్తే ఇక సినిమా మొత్తం ఏ రేంజ్ లో ఉండబోతోందో ఊహించుకోవచ్చు.

Also Read: ఓటిటిలోకి వచ్చేస్తున్న హాయ్ నాన్న.. ఎప్పుడంటే?

టీజర్ చివర్లో సుజలాం సుఫలాం అంటూ జాతీయ గేయం వినిపిస్తుంది. హృతిక్ ఓ ఫైటర్ జెట్ నుంచి బయటకు వస్తుండగా.. త్రివర్ణ పతాకం బ్యాక్‌గ్రౌండ్ లో కనిపిస్తుంది. ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా 2024 జనవరి 25న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా క‌నిపించ‌నుండ‌గా.. స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా (దీపికా పదుకొనే).. గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్‌ కపూర్‌ కనిపించనున్నాడు. ఈ మూవీని వయాకామ్‌ 18 స్టూడియోస్‌-మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button