తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Rakul Preeth Singh: పెళ్లి పీటలెక్కబోతున్న రకుల్ ప్రీతి సింగ్.. వరుడు ఎవరంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ తన క్రేజ్ ని సంపాదించుకొంది. చివరగా 2021లో వైష్ణవ్ తేజ్ కొండపొలం, 2023 లో బూ అనే హార్రర్ ఫిల్మ్ లో నటించింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. ఇదిలా ఉంచితే రకుల్.. తన ప్రేమ వ్యవహారాన్ని ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.

Also read: Jan Abraham: ముంబైలో విలువైన బంగ్లా కొన్న బాలీవుడ్ హీరో.. రేటు ఎంతంటే?

బాలీవుడ్ హీరో క‌మ్ ప్రొడ్యూస‌ర్ జాకీ భగ్నానితో రకుల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం. గ‌త మూడేళ్లుగా ప్రేమ‌లో ఉన్న ఈ బ్యూటిఫుల్ జంట.. ఈ ఏడాది 2024 ఫిబ్రవ‌రి 22న పెళ్లిచేసుకోనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వీరి పెళ్లి వేడుక గోవాలో జగగనుందని తెలిసింది. ఇప్పటికే, వీరి పెళ్లి వేదిక‌ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.

కాగా వీరి పెళ్లి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అతి కొద్ది మంది సినిమా ప్రముఖుల సమక్షంలో డెస్టినేషన్ మ్యారేజ్ జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇక త్వరలో రకుల్ తన మ్యారేజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Also read: Nikhil Siddartha: మరో సినిమాతో రాబోతున్న నిఖిల్.. షూటింగ్ షురూ

రకుల్ మనసు దోచేసిన బాలీవుడ్ హీరో జాకీ ఎవరబ్బా అంటూ ఫ్యాన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ లో యువ హీరోగా.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్న జాకీ భగ్నానీ సినీ ఇండస్ట్రీకి చెందిన వాడే. హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత వశు భగ్నానీ కుమారుడే జాకీ భగ్నానీ. కోల్ కతాకు చెందిన జాకీ భగ్నానీ ఉన్నత విద్యను అభ్యసించినా.. సినిమాలపై మోజుతో అమెరికాలో యాక్టింగ్ కోర్సు కంప్లీట్ చేసి బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు.

కల్ కిస్నే దేఖా’ సినిమాతో హిందీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్న ఈ యువ హీరో ఫాల్తు, అజబ్ గజబ్ లవ్, యంగిస్థాన్, వెల్కమ్ టు కరాచీ తదితర సినిమాల్లో నటించి మెప్పించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button