తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Rashmika Mandanna: వైరలవుతున్న రష్మిక టీషర్ట్.. నెటిజన్స్ కామెంట్స్

రష్మిక మందన్నా.. ఈమె పేరు ప్రస్తుతం ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతోంది. కారణం ఆమె నటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ యానిమల్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మికకు మంచి మార్కులే పడ్డాయి. మోస్ట్ వైలెంట్ అండ్ ఎమోషనల్ రైడ్ గా వచ్చిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. ఇక సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

Also read: Director Teja: డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్.. అలా అన్నాడేంటి?

ఇదిలా ఉంటే.. తాజాగా రష్మిక మందన్నా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మెరిశారు. అయితే ఆ సమయంలో ఆమె విజయ్ దేవరకొండకు సంబందించిన రౌడీ బ్రాండ్ హుడీ టీ షర్ట్ ను ధరించి కనిపించారు. దీంతో రష్మికను ఆ టీ షర్ట్ లో చూసిన నెటిజన్స్ విజయ్, రష్మిక మధ్యన సంథింగ్.. సంథింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం విజయ్ దేవరకొండ కూడా అదే టీ షర్ట్ ధరించి కనిపించారు. ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో.. విజయ్ ధరించిన ఆ టీ షర్ట్ నే ఇప్పుడు రష్మిక వేసుకున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి వాటిల్లో నిజమెంత అనేది తెలియాలంటే మాత్రం ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button