తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సలార్ ట్రైలర్ వచ్చేస్తుంది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తోపాటు, ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కేజిఎఫ్ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ ఓ లెవల్లో ఉండటంతో ఇక ట్రైలర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

డిసెంబర్ 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా సలార్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం సలార్ ట్రైలర్ ను డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button