తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Neru Trailer: మోహన్‌‌‌‌లాల్ కేసు నెగ్గుతాడా? …ఆస‌క్తిక‌రంగా ‘నెరు’ ట్రైల‌ర్

నలభయ్యేళ్లుగా రకరకాల పాత్రలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తున్నా.. ఇప్పటికీ కొత్తదనం కోసం మ‌ల‌యాళం స్టార్ హీరో మోహన్‌‌‌‌లాల్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం నెరు. ప్రియమణి కీలక పాత్రలో న‌టిస్తుంది. దృశ్యం, దృశ్యం 2 వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు అందించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు.

Also Read: మెగా 156 మూవీ నుంచి కీలక అప్డేట్.. చిరు సరసన సీనియర్ హీరోయిన్?

ఈ సినిమాలో విజయ్‌ మోహన్‌ అనే న్యాయవాది పాత్రలో కనిపిస్తున్నారు మోహన్ లాల్. ‘నేను విచారణకు హాజరై చాలా ఏళ్లయ్యింది. ఈ కేసుకు నేను సరిపోను’, ‘ఒక న్యాయవాదిగా విజయం, వైఫల్యాల గురించి అంచనా వేయడం సరికాదు’ అంటూ మోహన్ లాల్ చెప్పే డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా డిసెంబరు 21న రిలీజ్ కానుంది. అదే రోజున సలార్, డంకీ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button