తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Bhimaa Trailer: గోపీచంద్ విశ్వరూపం..`భీమా` ట్రైలర్‌ రిలీజ్

టాలీవుడ్ హీరో గోపీచంద్, కన్నడ మాస్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో వస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘భీమా’. ఈ సినిమాలో ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీసత్య సాయి ఆర్ట్స్ నిర్మాణంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కావడంతో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అనే విషయం అర్థమైంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ విడుదల చేశారు.

ALSO READ: రామ్ చరణ్ కొత్త మూవీ ఆర్‌సీ16 అప్డేట్.. ఏంటంటే?

రెండు షేడ్స్ ఉన్నాయా?

అఘోరాలు ఉండే ఓ ఊరు, అందులో విలన్స్, కొన్ని సమస్యలు వస్తాయి. హీరో ఎంట్రీ.. సమస్యలను ఎలా పరిష్కరించాడు? ఈ కథలో ఇంకో గోపీచంద్ కూడా ఉన్నట్లు ట్రైలర్‌లో చూపించారు. ఇందులో గోపీచంద్‌ రెండు పాత్రల్లో నటిస్తున్నాడా? పాత్రలో రెండు షేడ్స్ ఉన్నాయా? ఆసక్తికరంగా మారింది. కాగా, గోపీచంద్‌ లుక్‌ అదిరిపోయింది. ఈ సినిమా మార్చి 8న మహాశివరాత్రి కానుకగా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button