తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

RC 16: రామ్ చరణ్ కొత్త మూవీ ఆర్‌సీ16 అప్డేట్.. ఏంటంటే?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే సినిమా విడుదల కానుంది. అయితే రామ్ చరణ్ మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో త్వరలోనే ఆర్‌సీ16 సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమా అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

ALSO READ: నాని బర్త్ డే స్పెషల్.. ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ రిలీజ్

కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్..

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వచ్చే ఈ మూవీ పూజా కార్యక్రమాలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌సీ16కు మేకర్స్ కెమెరా మెన్‌ను ఫిక్స్‌ చేశారు. ఇందుకు సౌత్‌ ఇండియాలో క్రేజీ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలును ఎంపిక చేశారు. నేడు రత్నవేలు బర్త్ డే సందర్బంగా విషెస్ చెబుతూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఆర్‌సీ16గా రూపొందుతోంది. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, అంబటి అర్జున్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button