తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Chaari 111: వెన్నెల కిషోర్ ‘చారి 111’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చారి 111’. ఈ మూవీలో త‌మిళ బ్యూటీ సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది. టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీ నుంచి కాన్సెప్ట్‌ టీజర్‌ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, ఈ మూవీ నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ALSO READ: నెల రోజులైనా… తగ్గని హవా.. ‘హనుమాన్‌’ ఖాతాలో మరో రికార్డు

వయలెన్స్… వయలెన్స్

ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ఎటువంటి కెమికల్, బయలాజికల్ వెపన్స్ తయారు చేయకూడదని 1992లో ఇండియా పాకిస్తాన్ జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నాయని మురళీ శర్మ చెప్పే మాటలతో ‘చారి 111’ ట్రైలర్ ప్రారంభమవుతోంది. చివరలో ‘వయలెన్స్… వయలెన్స్… వయలెన్స్… ఐ లైక్ ఇట్! అంటూ ఏజెంట్‌గా వెన్నెల కిషోర్ క‌నిపించ‌నున్నారు. ఇక సీనియర్ నటుడు మురళి శర్మ ఈ సినిమాలో స్పై ఏజెన్సీ హెడ్​గా కనిపించనున్నారు. ట్రైల‌ర్ మొత్తం ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సాగింది. ఈ సినిమాను బర్కత్‌ స్టూడియెస్‌ బ్యానర్‌పై అదితి సోని నిర్మిస్తుంది. ఈ సినిమా మార్చి 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button