తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Chiranjeevi: విశ్వంభర నుంచి క్రేజీ అప్ డేట్… విలన్‌పై క్లారీటి?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియా ఫాంటసీ చిత్రం విశ్వంభర. బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో త్రిష ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. ఈషా చావ్లా, హుషారు ఫేం రమ్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: ‘ఏమండి.. నేను కాలేజీకి వెళ్లాలి’.. ఆకట్టుకుంటున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ టీజర్

ఇంతకీ ఈ చిత్రంలో విలన్‌గా ఎవరు కనిపించబోతున్నారో తెలుసుకునేందుకు మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఫిలింనగర్‌ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. పాపులర్‌ యాక్టర్ రావురమేశ్‌ ఇందులో విలన్‌గా కనిపించబోతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ అప్‌డేట్‌ కూడా అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button