తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

12th Fail: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా

బాలీవుడ్‌లో అతి తక్కువ బడ్జెట్‍తో చిన్న సినిమాగా గతేడాది అక్టోబర్ 27న విడుదలైన ‘12th ఫెయిల్’ పెద్ద హిట్ కొట్టింది. ఈ సినిమాకు విధు వినోద్‌ చోప్రా దర్శకత్వం వహించగా.. విక్రాంత్‌ మస్సే ప్రధానపాత్రలో నటించారు. ఆ తర్వాత ఈ సినిమా హిందీ వర్షన్‌లో డిస్నీ + హాట్ స్టార్ వేదికగా ఓటీటీలోకి వచ్చేసింది. కానీ తెలుగులో రాకపోవడంతో తెలుగు అభిమానులు నిరాశకు గురయ్యారు. తాజాగా, ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా తెలుగు, తమిళ్‌ వర్షన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ALSO READ: తిరుమలలో హీరోయిన్ సమంత.. ఫొటోలకు ఎగబడ్డ ఫ్యాన్స్

ఐదు అవార్డులు..

నేటి నుంచి ‘12th ఫెయిల్‌’ సినిమా డిస్నీ + హాట్ స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ సినిమా మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో 12వ తరగతి ఫెయిల్‌ అయిన యువకుడు.. ఐపీఎస్‌ ఎలా అయ్యాడనే కోణంలో కథను తెరకెక్కించారు. కాగా, ఈ సినిమా నుంచి ఎందరో యువకులు ప్రేరణ చెందారు. ఈ సినిమా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button