తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Gaami: విశ్వక్ సేన్ ‘గామి’ సాంగ్ రిలీజ్… ఫుల్ ఎమోష‌న‌ల్‌గా సాగిన సాంగ్

టాలీవుడ్ యువ న‌టుడు విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గామి’. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గామి టీజ‌ర్ వీడియో విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ మ్యూజిక‌ల్ అప్‌డేట్ ఇచ్చారు.

Also Read: నాని బర్త్ డే స్పెషల్.. ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ రిలీజ్

ఈ మూవీ నుంచి గమ్యాన్నే.. ది క్వెస్ట్ సాంగ్ అంటూ సాగే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. సొమ్మసిల్లిపోయి కూలింది కాలం.. సత్తువంతు లేక ఇంకెంత కాలం.. అంటూ సాగిన ఈ పాట ఫుల్ ఎమోష‌న‌ల్‌గా సాగింది. సనపతి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించిన ఈ పాట‌కు అనురాగ్ కులకర్ణి, స్వీకర్ అగస్తి & సుగుణమ్మ క‌లిసి పాడ‌రు. స్వీకర్ అగస్తీ సంగీతం అందించాడు.

Also Read: ఓటిటిలోకి కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

చాందిని చౌదరి కథానాయిక న‌టిస్తున్న ఈ సినిమాకు విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాకు కార్తీక్‌ శబరీష్‌ నిర్మాత‌. గత నాలుగేళ్లుగా ఈ సినిమా వర్క్ జరిగి పలుమార్లు వాయిదా పడి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. విశ్వక్ అఘోరాగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను మార్చి 08న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button