తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hanu Man: ‘హను మాన్’మూవీ… రామదూత స్తోత్రం రిలీజ్!

తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ ‘హను మాన్’ సినిమాను రూపొందించాడు. నిరంజన్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. అమృత అయ్యర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రబృందం.

Also Read: యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎక్కడ శిక్షణ పొందాడో తెలుసా?

అందులో భాగంగా కొద్దిసేపటి ముందు ఈ సినిమా నుంచి ‘రామదూత స్తోత్రం’ను విడుదల చేశారు. ‘రం రం రం రక్తవర్ణం .. దినకర వదనం’ అంటూ ఈ స్తోత్రం మొదలవుతోంది. గౌర హరి సంగీతాన్ని అందించగా, శ్రీచరణ్ .. లోకేశ్వర్ .. హర్షవర్ధన్ ఆలపించారు.

Also Read: సైబర్ కేటుగాళ్ల వలలో ప్రముఖ నటి… ఎంత పొగొట్టుకుందంటే?

ఈ సాంగ్ అద్భుతమైన విజువల్స్ తో రామ ఆంజనేయ భక్తులని మెప్పించే విధంగా ఉందని చెప్పాలి. మెయిన్ గా గౌర హరీష్ ఇచ్చిన మ్యూజిక్ ఆ రిథమ్ కానీ చాలా బావున్నాయి. అలాగే సాంగ్ లో శ్రీచరణ్ భాస్కరుణి వోకల్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. మొత్తానికి అయితే మేకర్స్ హను మాన్ ఫ్యాక్టర్ తో డివోషనల్ గా సాలిడ్ ట్రీట్ ని ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button