తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Anjali Patil: సైబర్ కేటుగాళ్ల వలలో ప్రముఖ నటి… ఎంత పొగొట్టుకుందంటే?

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్టుబడులంటూ ..ఆఫర్లు అంటూ వల విసిరి నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. వీరి చేతిలో చదవుకోని వారే కాదు.. బాగా చదువుకున్నవారు కూడా మోసపోతున్నారు. లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు. పోలీస్‌ అధికారులు ఎన్నిసార్లు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసినా.. సైబర్‌ నేరాల ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే.. తాజాగా ప్రముఖ నటి అంజలి పటేల్ సైబర్ నేరగాళ్ల వలలో పడింది.

Also Read: బెల్లంకొండ నెక్ట్స్ మూవీపై వీడిన ఉత్కంఠ… ఆసక్తికరంగా అనౌన్స్ మెంట్

తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె నిమిషాల్లో లక్షలు పోగొట్టుకుంది. తెలుగులో ‘నా బంగారు తల్లి’ సినిమాలో లీడ్ రోల్ చేసి చాలా పేరు తెచ్చుకుంది. నంది అవార్డు కూడా గెలుచుకుంది. అయితే తాజాగా ఈమెకి డిసెంబరు 28న దీపక్ శర్మ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫెడ్ ఎక్స్ ఉద్యోగి అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఈమె పేరుతో ఉన్న ఓ పార్సిల్, డ్రగ్స్‌తో తైవాన్‌లో పట్టుబడిందని అన్నాడు. పార్సిల్‌లోనే ఆధార్ కార్ట్ కాపీ ఉందని చెప్పాడు.

Also Read:  ‘స్వచ్ఛమైన గోదావరి ప్రేమకథ’.. శశివదనే మూవీ అప్‌డేట్!

తన ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయ్యే అవకాశముందని భయపడిన అంజలి పాటిల్. ముంబయి సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ని సంప్రదిస్తానని సదరు వ్యక్తితో చెప్పింది. ఇలా జరిగిన కాసేపటికే సైబర్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నానని బెనర్జీ అనే వ్యక్తి.. అంజలికి కాల్ చేశాడు. మీ ఆధార్ కార్డ్.. మూడు బ్యాంక్ ఖాతాలకు కనెక్ట్ అయ్యిందని, అవి మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కుని ఉన్నాయని కాస్త భయపెట్టాడు. ప్రొసెసింగ్ ఫీజ్ అని చెప్పి 96,525 పంపాలని అంజలికి చెప్పగా, ఆమె వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం 4,83,291 డబ్బు పంపాలని అన్నాడు.

Also Read: గుంటూరు కారంతో హనుమాన్‌ పోటీ.. ట్వీట్ వైరల్

అలా డబ్బులు పంపేసిన కాసేపటికి నటి అంజలి పాటిల్.. తాను మోసపోయాననే విషయాన్ని గ్రహించింది. మొత్తంగా 5.79 లక్షల వరకు అంజలి నష్టపోయింది. దీంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. ఐపీసీ 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button